బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించిన రిటైర్డ్ స్పెషల్ ఆఫీసర్

బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించిన రిటైర్డ్ స్పెషల్ ఆఫీసర్

KDP: కడపలోని CP బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. చెల్లప్ప బుధవారం సందర్శించారు. తాళపత్ర గ్రంథాలు, తామ్రపత్రం, చేతితో చేసిన కాగితాలు, బ్రౌన్ రచనలు, మెకంజీ కైఫియత్తులను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో సందర్శించిన దానికంటే ఇప్పుడు కేంద్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.