'కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు'

SRCL: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 సంప్రదించాలన్నారు.