'స్వాతంత్య్ర పోరాటంలో బిర్సా ముండా పోరాటం ప్రత్యేకం'
E.G: భారతీయ ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు రాజమండ్రిలోని బీజేపి కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొని బిర్సా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో బిర్సా ముండా పోరాటం ప్రత్యేకమైందని కొనియాడారు.