విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కర్నూలులోని SLV కేబుల్ నెట్‌వర్క్ ఉద్యోగి జి. రామ్మోహన్ (56) బుధవారం సాయంత్రం బళ్లారి చౌరస్తా వద్ద కేబుల్ వైర్లు సరిచేస్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు వెంటనే 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.