ఈతకు వెళ్లి యువకుడు మృతి

ఈతకు వెళ్లి యువకుడు మృతి

KNR: ఈతకు వెళ్లిన ఓ యువకుడు కాకతీయ కాలువలో మునిగి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. మృతుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి మండలం సగరెల్లి గ్రామానికి చెందిన విజయ్(28)గా పోలీసులు గుర్తించారు. కరీంనగర్ రోడ్డులోని కాలువలో ఈతకు వెళ్లగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు.