సైడ్ డ్రైన్ నిర్మాణానికి భూమి పూజ
VKB: పాలేపల్లిలో మురుగునీటి పారుదల సమస్య పరిష్కారమే లక్ష్యంగా సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పరిగి MLA రామ్మోహన్ రెడ్డి సహకారంతో వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ పనులను చేపట్టినట్లు సర్పంచ్ సుజాత బసప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దస్తయ్య, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.