ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

NGKL: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. అంబటిపల్లి గ్రామంలో వేముల శివ(26) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బుధవారం స్థానికులు తెలిపారు. ప్రేమ విఫలం కావడంతోనే తీవ్ర మనస్తాపానికి గురై చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.