‘వ్యవసాయం నిలవాలి.. రైతన్న గెలవాలి’

‘వ్యవసాయం నిలవాలి.. రైతన్న గెలవాలి’

PPM: రాష్ట్రాన్ని సాగుకు అనుకూల పరిస్థితులు కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, 'వ్యవసాయం నిలవాలి రైతన్న గెలవాలి’ అన్నదే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. ‘రైతన్నా మీకోసం‘ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పట్టణంలోని జగన్నాధపురంలో పర్యటించిన ఎమ్మెల్యే రైతుల ఇళ్లకు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.