దోపిడీ ఘటనలో ముగ్గురికి మూడేళ్లు జైలు

కృష్ణా: గన్నవరం (M) ముస్తాబాద్ శివారులో గతేడాది ఆగస్టు 26న దోపిడీ ఘటనలో ముగ్గురికి మూడేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాలపర్తి వెంకన్న, నల్లగొండ సురేశ్, నక్క గోపిలను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.