VIDEO: 'హెచ్పీవీ వ్యాక్సిన్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ దూరం'
కోనసీమ: 14 ఏళ్లు దాటి 15 ఏళ్ల లోపు బాలికలందరూ హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు అని బండారులంక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ అమృత, డాక్టర్ గౌతమి అన్నారు. వారి ఆధ్వర్యంలో పీహెచ్సీ వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని అమలాపురం ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి ప్రారంభించారు.