పునరావాస కేంద్రాలలో బ్రెడ్లు పంపిణీ
కోనసీమ: అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకు అల్పాహారంగా కూటమి నాయకులు బ్రెడ్, రస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సాయంత్రం తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున పూరి గుడిసెలలో ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే పునరావాస కేంద్రాలకు రావాలని తెలిపారు.