సంతాన వెంకటేశ్వర స్వామికి పూలంగి సేవ

సంతాన వెంకటేశ్వర స్వామికి పూలంగి సేవ

తిరుపతి: ఏర్పేడు మండలం వికృతమాలలో ఉన్న సంతాన వెంకటేశ్వర స్వామికి గురువారం పూలంగి సేవ విశేషంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూలంగి సేవ చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.