స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం

NLG: నార్కట్ పల్లి మండలం, అమ్మనబోలు గ్రామానికి చెందిన కె. రాజబాబు (35) ఇటీవల గుండెపోటుతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న పదవ తరగతి బ్యాచ్ స్నేహితులంతా కలిసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అందరూ కలిసి రాజబాబు ముగ్గురు పిల్లలకు పోస్ట్ ఆఫీస్‌లో రూ. 65 వేలు పదేళ్లు డిపాజిట్ చేశారు. ఇవాళ రాజబాబు కుటుంబానికి డిపాజిట్ పత్రాలను అందజేశారు.