VIDEO: గ్యాస్‌ స్టవ్‌తో రాజేశ్వరి వినూత్న ప్రచారం

VIDEO: గ్యాస్‌ స్టవ్‌తో రాజేశ్వరి వినూత్న ప్రచారం

MBNR: రాజోలి మండల కేంద్రంలోని 15వ వార్డు ప్రచారంలో వినూత్న దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. ‘గ్యాస్‌ పొయ్యి’ గుర్తుతో పోటీచేస్తున్న అభ్యర్థి రాజేశ్వరి సత్య, ఆదివారం గ్యాస్‌ స్టవ్‌ను నెత్తిన పెట్టుకుని ప్రచారం చేశారు. ఉదయం నుంచి ఇదే తరహాలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకర్షించారు. ఆమె ప్రచారాన్ని చూసి పలువురు ఆశ్చర్యంతో పాటు నవ్వులు పూయించారు.