'వరద బాధిత రైతులను ఆదుకోవాలి'

ASF: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు దినకర్, కార్తీక్‌లు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం వాంకిడి మండలంలో పంట నష్టాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.