మెలియాపుట్టిలో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు
SKLM: మెలియాపుట్టి తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ డేను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గతంలో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన కే .శేషగిరిరావు, లక్ష్మీనారాయణతో పాటు పలువురు రెవెన్యూ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. డిప్యూటీ తహసీల్దార్ రాము, సీనియర్ అసిస్టెంట్ జగన్మోహనరావు రెవిన్యూ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.