VIDEO: అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరులోని ప్రత్యేక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం అధికారుల సమావేశం జరిగింది. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎండల నేపథ్యంలో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో RO ప్లాంట్లు, పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.