తణుకులో ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్
W.G: ఈనెల 13న తణుకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నాలుగు అదనపు జిల్లా జడ్జ్ డి. సత్యవతి చెప్పారు. బుధవారం తణుకు కోర్టు పరిధిలో పోలీసు అధికారులు, న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులు రాజీ చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు కృష్ణసత్యలత, సాయిరాం పోతర్లంక, కృష్ణవేణి పాల్గొన్నారు.