VIDEO: భారీ ఎత్తున తరలివచ్చిన ఆదివాసీలు
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న 'ధర్మ యుద్ధ సభ' కోసం ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు భారీ ఎత్తున తరలివచ్చారు. వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ పెద్దలు ర్యాలీగా వెళ్లి సభకు హాజరయ్యారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 'ఆదివాసీ బచావో, లంబాడా హటావో' అంటూ నినాదాలు చేశారు.