'డిజిటల్ క్లాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'

'డిజిటల్ క్లాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'

SRCL: ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాసులను సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మానవ మనుగడకు విద్యే కీలకమని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, సాధించాలనే లక్ష్యంతో చదువుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.