ఐదు రోజులు మోస్తరు వర్షాల సూచన

ఐదు రోజులు మోస్తరు వర్షాల సూచన

ATP: బుక్కరాయసముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్బాబు, నారాయణస్వామి తెలిపిన వివరాల ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 32 డిగ్రీల వరకు, రాత్రి 22 నుంచి 24 డిగ్రీల వరకు నమోదవుతాయని, ఈశాన్య గాలులు గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చని తెలిపారు.