'విజయ్‌కు ఉన్న గుండె ధైర్యం రజినీకి లేదు'
తమిళనాడులో రజినీ అభిమానులు VS విజయ్ అభిమానులు మధ్య వివాదం నెలకొంది. రజినీపై టీవీకే ముఖ్య నేత ఆదవ్ అర్జున్ విమర్శలు చేశారు. 'నటుడు రజినీకాంత్‌కు భయం ఎక్కువ. విజయ్‌కు ఉన్న గుండె ధైర్యం రజినీకాంత్‌కు లేదు. రజినీని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంది డీఎంకేనే. ఆయన బెదిరింపులతోనే ఇంటికే పరిమితమయ్యారు. DMKని ఎదిరించే ధైర్యం విజయ్‌కి మాత్రమే ఉంది' అని అన్నారు.