VIDEO: పులివెందుల యర్రబల్లె చెరువుకు జలకళ
KDP: పులివెందుల మండల ప్రజల, రైతుల చిరకాల వాంఛ, మండల జీవనాడి అయిన యర్రబల్లి చెరువుకు కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ చేరుకున్నాయి. ఈ శుభ తరుణంలో పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి చెరువు వద్దకు చేరుకుని, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. యర్రబల్లె చెరువుకు నీరు రావడం తనకు పట్టలేని ఆనందాన్ని ఇస్తోందనీ ఆమె సంతోషం వ్యక్తం చేశారు.