యువకుడి జేబులో పేలిన ఫోన్
తిరుపతి: తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగకు చెందిన నరసింహారెడ్డి(36) పిడుగుపాటుకు గురైన విషయం విధితమే. నరసింహారెడ్డి తన పొలంలో కూలీల చేత వరినాట్లు నాటించాడు. వర్షం వస్తుండడంతో గొడుగు వేసుకుని నిలబడి ఉండగా, సమీపంలోనే పిడుగు పడింది. దీంతో అతని పాంట్ జేబులోని ఫోన్ పేలింది. తొడ భాగం పూర్తిగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు ఆసుపత్రికి తరలించారు.