బొలెరో బోల్తా.. డ్రైవర్‌కి గాయాలు
అల్లూరి జిల్లా గరికిబంద గ్రామం రెండవ మలుపు వద్ద వరి తవుడు లోడుతో వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ వాహనం పాడేరు నుంచి వరి తవుడు లోడుతో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.