అగ్రవర్ణాల వారిని అరెస్టు చేయాలని POW డిమాండ్

అగ్రవర్ణాల వారిని అరెస్టు చేయాలని POW డిమాండ్

NRPT: జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్‌లో ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించింది. POW రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ.. కుమ్మెర బీసీ కులస్తులపై జరిగిన దాడిని ఖండించారు. దాడికి కారణమైన అగ్రవర్ణాల వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.