పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం: MLA
కోనసీమ: మొంథా తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో రోడ్లన్ని దెబ్బతిన్నాయన్నారు. రైతాంగం మొత్తం ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్ధితిలలో ఉన్నారన్నారు.