షాక్.. OLXలో అమ్మకానికి MRO కార్యాలయం
AP: ప్రకాశం జిల్లా గిద్దలూరు MRO కార్యాలయాన్ని ఓ ఆకతాయి OLXలో అమ్మకానికి పెట్టాడు. అంతేకాదు ఎమ్మార్వో కార్యాలయం ఎక్కడ ఉందనేది తెలిసేలా లొకేషన్ కూడా షేర్ చేశాడు. కేవలం రూ.20 వేలకే అమ్మకానికి ఉందని, త్వరపడాలని పిలుపునిచ్చాడు. ఈ ప్రకటనను OLXలో చూసి రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.