పరశురామేశ్వర ఆలయాన్ని సందర్శించిన పురావస్తు డైరెక్టర్

పరశురామేశ్వర ఆలయాన్ని సందర్శించిన పురావస్తు డైరెక్టర్

TPT: గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం పురావస్తు శాఖ డైరెక్టర్ అజ్మీర్ బీమా పర్యటించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, రానున్న కుంభాభిషేకం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బత్తలగిరి నాయుడు, ఈవో రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.