గ్రీవెన్స్ డేలో 12 ఫిర్యాదులు
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది ఫిర్యాదు దారులతో నేరుగా మాట్లాడి, సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.