ఆదోనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
KRNL: ఆదోని పట్టణ శివారులో ఆదివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ అబ్దుల్ గౌస్ ఆధ్వర్యంలో వాహనాలను పరిశీలించి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని కొత్త చట్టాల ప్రకారం రూ.10 వేలు జరిమానా, జైలు శిక్ష ఉంటుందని సీఐ అబ్దుల్ గౌస్ హెచ్చరించారు.