VIRAL VIDEO: బ్యాంక్ మేనేజర్‌ను కొట్టిన భార్య
బ్యాంక్ మేనేజర్‌ను తన భార్యే దారుణంగా కొట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యూపీలోని బిసౌలీలో బ్యాంక్ మేనేజర్ మహిళా సిబ్బందితో చనువుగా ఉంటున్నాడని ఆరోపిస్తూ.. అతడు బ్యాంక్ నుంచి బయటకు రాగానే తన బంధువులతో కలిసి భార్య దాడి చేసింది. గతంలో ఈ ఘటనపై భర్తను ప్రశ్నిస్తే తనను హింసించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు.