క్రీడాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే

శ్రీకాకుళం: నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులతో కలిసి అంపోలు జైల్ రోడ్డు, పాత్రనివలస ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మంగళవారం స్థల పరిశీలన చేశారు. సరైన క్రీడా మైదానం లేక ఎందరో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.