ప్రకాశం జిల్లాలో చిన్నారులపై లైంగిక దాడి

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ..బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మంగళవారం రాత్రి ఇంకొల్లులో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఇంకొల్లు సీఐ రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకొని లైంగిక దాడులకు పాల్పడుతున్న వ్యక్తి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీచ్చారు.