'బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలి'
తూ.గో: నిడదవోలు రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు చింతల బాలాజీ నేతృత్వంలో మంగళవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరై ప్రశిక్షణ ప్రాధాన్యతను వివరించారు. బీజేపీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.