జిమ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎస్సై
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయిరాం హైటెక్ మల్టీ మెన్, ఉమెన్ జిమ్ సెంటర్‌ను శుక్రవారం తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ ప్రారంభించారు. అనంతరం ఎస్సై జిమ్ సాధన చేశారు. ఉదయం జిమ్ సాధన చేయడం ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జిమ్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ఆనందించదగిన విషయం అన్నారు.