యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: డీఎస్పీ

VZM: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు సూచించారు. ఇవాళ రేగిడి మండల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులు, శక్తి వారియర్స్, మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శక్తి వారియర్స్‌గా ఎంపికైన 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. డ్రగ్స్, పోక్సో చట్టంపై విద్యార్థులకు వివరించారు. ఆయన వెంట ఎస్సై నీలావతి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.