రేపు గూడూరులో పవర్ కట్

రేపు గూడూరులో పవర్ కట్

తిరుపతి జిల్లా గూడూరులో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో పట్టణ ఏఈ శ్వేత తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గూడూరు 1వ పట్టణ సబ్‌స్టేషన్, నారాయణ సబ్‌స్టేషన్ పరిధిలో సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.