'పాఠశాల భవనాలు పూర్తి చేయండి'
PPM: జియ్యమ్మవలస మండలం చినతోలుమండగూడ, నిడగల్లుగూడ, పెదదొడిజ గ్రామాల్లో నిలిచిపోయిన గిరిజన సంక్షేమ పాఠశాలల భవనాలు పూర్తి చేయాలని గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్ అధికారులను కోరారు. ఆదివారం కురుపాంలో మాట్లాడుతూ.. సర్వ శిక్ష అభియాన్ నిధులతో పాఠశాల అదనపు భవనాలు మంజూరయ్యాయని, వీటి నిర్మాణాలకు ముందుగానే కొంత అడ్వాన్స్ పేమెంట్ విడుదల చేయడం జరిగిందన్నారు.