'ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' రెడీ
'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్ మొదటి రెండు సీజన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ మూడోసారి అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో మొదటి రెండు సీజన్లలో ఏం జరిగిందో తెలియజేస్తూ సదరు సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే దీన్ని తెరకెక్కించారు.