VIDEO: సీపీఆర్‌తో నాగుపాముకు ఊపిరి పోశారు
WNP: కొత్తకోట పరిధి చింతకుంటలో నాగుపామును CPR చేసి బతికించిన ఘటన చోటుచేసుకుంది. సాగర్ స్నేక్ సొసైటీ చీఫ్ కృష్ణ సాగర్ వివరాల ప్రకారం.. స్ప్రింకర్ పైపులో నాగుపాము నక్కిందని గుర్తించిన రైతు పైపునకు రెండువైపులా బట్టలు కుక్కడంతో గాలి ఆడక పాము అపాస్మరక స్థితికి వెళ్లింది. దీంతో స్నేక్ క్యాచర్ తిలక్ సూచన మేరకు పాముకు CPR చేసి ఊపిరి పోశారు. అనంతరం చల్లటి వాతావరణంలో వదిలేశారు.