ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: దాస్యం వినయ్ భాస్కర్

ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: దాస్యం వినయ్ భాస్కర్

HNK: ఆటో డ్రైవర్ మేకల రమేష్ కుమార్తె హర్షిణి వైద్య విద్యలో పీజీ రేడియాలజీ సీటు సాధించిన సందర్భంగా బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయంలో గురువారం ఆమెను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రతిభ ఉంటే పేదరికం అడ్డుకాదని హర్షిణి నిరూపించిందన్నారు. తెలంగాణలో వైద్య విద్యకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు.