సుంకేసుల బ్యారేజీ 13 గేట్లు ఎత్తివేత

GDWL: ఇటీవల కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి వరద యథావిధిగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం బ్యారేజికి ఇన్‌ఫ్లో 61,450 క్యూసెక్కులు వస్తోంది. దీంతో అధికారులు బ్యారేజీ 13 గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 56,927 క్యూసెక్కులు, KC కెనాల్‌కు 2,180 క్యూసెక్కులు, మొత్తం 59,107 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.