ఆచార్య చలంకు అంబేద్కర్ అవార్డు

VSP: తమిళనాడు వీసీకే డాక్టర్ అంబేద్కర్ అవార్డును విశాఖకు చెందిన ఆచార్య కె.యస్. చలంకు ప్రకటించారు. డాక్టర్ అంబేద్కర్, పెరియార్‌ల పేరు మీద ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఈ సంవత్సరం ఆచార్య కె.యస్. చలం, దేవనూర్ మహాదేవలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం చలం ఈ విషయాన్ని స్థానిక మీడియాకు తెలిపారు.