అలిపిరి వద్ద దొరికిన డబ్బు ఎవరిదంటే..?
తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కారులో రూ.65లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. నగదుతో పాటు కారులో ఉన్న వ్యక్తులను అలిపిరి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. తమిళనాడుకు చెందిన దీపక్ అనే వ్యక్తి చిల్లర నాణేల (కాయిన్స్) బిజినెస్ చేస్తుంటారు. ఆయనకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ డబ్బులతో తిరుమలకు బయల్దేరినట్లు సమాచారం.