రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

MHBD: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన మరిపెడ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ ఆటో ప్రధాన రహదారిపై ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.