ఏడుగురు నాయకులపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన ఏడుగురు నాయకులపై ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.