జగన్‌కు అచ్చెన్న క్షమాపణలు చెప్పాలి: MLC

జగన్‌కు అచ్చెన్న క్షమాపణలు చెప్పాలి: MLC

AP: జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. 'సభలో లేని జగన్ గురించి మాట్లాడారు. తిరుమలకు ఏడుకొండలు ఉండాలని YSR జీవో ఇస్తే చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు ఒక్కసారైన తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా? లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు? జగన్‌కు అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలి' అంటూ డిమాండ్ చేశారు.