గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ పెద్దపీట
ADB: సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తుందని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో డిప్యూటీ కలెక్టర్ల బృంద సభ్యులతో సంక్షేమ పథకాల అమలు, గిరిజనులకు కల్పిస్తున్న విద్య, వైద్యం, గిరిజనులకు, పీ.వీ.టీ.జీలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు.