VIDEO: కాలిపోయిన ఎలక్ట్రికల్ బైక్

VIDEO: కాలిపోయిన ఎలక్ట్రికల్ బైక్

కృష్ణా: గుడివాడలో ఫ్లై ఓవర్‌పై సోమవారం ఎలక్ట్రిక్ బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ప్రయాణంలో ఉన్న సమయంలోనే బైక్ నుంచి పొగలు రావడం గమనించిన రైడర్ వెంటనే వాహనాన్ని ఆపి సురక్షిత ప్రాంతానికి వెళ్లాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.